ఐఐటీ హైదరాబాద్‌..స్టార్టప్‌ల కోసం స్పెషల్‌ ఫండ్‌

2 Dec, 2021 11:20 IST|Sakshi

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో ఘనత వచ్చి చేరింది. కేంద్రం అందించే స్టార్టప్‌ సీడ్‌ ఫండ్‌కి ఈ కాలేజీ ఎంపికైంది. దీంతో ఇక్కడ నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం లభించనుంది.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ సంస్థ స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పేరుతో నూతన ఆవిష్కరణలకు ఆర్థిక సాయం అందిస్తోంది.  ఈ సంస్థకు చెందిన అడ్వైజరీ కమిటీ ఐఐటీ, హైదరాబాద్‌కి స్టార్టప్‌ ఫండ్‌ కింద రూ. 5 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. గత పదమూడేళ్లుగా ఐఐటీ హైదరాబాద్‌ సాధించిన పురోగతి ఆధారంగా ఈ నిధులు మంజూరు చేశారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఎన్‌ఎల్‌పీ, రొబోటిక్స్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్యెమెంటెడ్‌ రియాలిటీ, బ్లాక్‌ చెయిన్‌ తదితర టెక్నాలజీ మీద అభివృద్ధి చేస్తున్న కాన్సెప్టులు, స్టార్టప్‌లకు సాయం అందివ్వనున్నారు. రాబోయే మూడేళ్లల కాలంలో కనీసం 10 నుంచి 15 వరకు స్టార్టప్‌లు ఐఐఐటీ హైదరాబాద్‌ నుంచి వస్తాయని అంచనా. 

మరిన్ని వార్తలు