ఇండియా సిమెంట్స్‌కు నష్టాలు

8 Nov, 2022 11:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ కంపెనీ  ఇండియా సిమెంట్స్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 113 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది.

గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం 7.5 శాతం బలపడి రూ. 1,327 కోట్లను దాటింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 27 శాతం పెరిగి రూ. 1,528 కోట్లకు చేరాయి.  ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్పంగా లాభపడి రూ. 248 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు