Start Up Companies: ఇది ఆరంభం మాత్రమే.. భారత్‌లో 75వేల స్టార్టప్‌లు

4 Aug, 2022 08:41 IST|Sakshi

న్యూఢిల్లీ:  స్టార్టప్‌ కంపెనీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం 75,000 పైచిలుకు స్టార్టప్‌లకు భారత్‌ నెలవుగా మారిందని ఆయన వెల్లడించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో ఈ ఘనత సాధించడం .. దార్శనికత శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలను భారత్‌ సాధిస్తుందని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో మంత్రి ట్వీట్‌ చేశారు. కొద్ది కాసులకు ఆశపడి విదేశాల బాట పట్టకుండా దేశీయంగానే లిస్టింగ్‌ చేయడంపై దృష్టి పెట్టాలని అంకుర సంస్థలకు ఆయన ఇటీవలే సూచించారు.

చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!

మరిన్ని వార్తలు