ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అప్‌

27 Oct, 2023 04:47 IST|Sakshi

క్యూ2లో రూ. 1,988 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది.

వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి.  

ఫలితాల నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు