ప్రపంచంలో అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో తెలుసా?

9 Aug, 2021 15:53 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా?. చాలా మంది అమెరికా లేదా వేరొక దేశం పేరు చెబుతారు కానీ, అది అబద్దం. మన దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఉంది. ఈ గ్రామంలో 7,600 ఇల్లు ఉన్నాయి. ఈ గ్రామలోని ప్రజలు డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులో వారు 5,000 కోట్ల రూపాయల డిపాజిట్ చేశారు. మనం మాట్లాడుతున్న గ్రామం పేరు మాధపర్. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. అంచనాల ప్రకారం గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ సుమారు 15 లక్షల రూపాయలు. 

ఈ గ్రామంలో 17 బ్యాంకులు మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, పచ్చదనం, ఆనకట్టలు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలో అత్యాధునిక గౌశాల కూడా ఉంది. కానీ ఈ గ్రామం, మన దేశంలోని సంప్రదాయ గ్రామాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది అంటే?. దీనికి ప్రధాన కారణం గ్రామస్థుల కుటుంబ సభ్యులు, బంధువులలో ఎక్కువ మంది యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు వంటి విదేశాలలో నివసిస్తున్నారు. 65% కంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు వారు దేశం వెలుపల నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతున్నారు. 

ఆ గ్రామ ఎన్ఆర్ఐలలో చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి గ్రామంలో తమ వెంచర్లను ప్రారంభించారు. కొన్ని నివేదికల ప్రకారం, మాధపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను 1968లో లండన్ లో ఏర్పాటు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న మాధపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రజల మధ్య మంచి సంబందాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇలాంటి ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. చాలామంది గ్రామస్థులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు తమ మూలాలను ఎన్నడూ మారిచిపోలేదు. వారు నివసిస్తున్న దేశం కంటే గ్రామ బ్యాంకుల్లో తమ డబ్బును ఆదా చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఇప్పటికీ ఇక్కడ ప్రధాన వృత్తిగా ఉంది. 
 

మరిన్ని వార్తలు