ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఇండిగో 

27 Sep, 2023 02:44 IST|Sakshi

సొంతంగా నెట్‌వర్క్‌ నిర్మాణం 

ఇతర సంస్థలతో భాగస్వామ్యం 

సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ 

న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలోనే అద్భుతమైన, అధిక పోటీతో కూడిన ఏవియేషన్‌ మార్కెట్‌ అని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ పేర్కొన్నారు. ఇండిగో మరింత పెద్ద, మెరుగైన, ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. తనకంటూ సొంతంగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటున్నట్టు, ఇతర ఎయిర్‌లైన్‌ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని పట్టణాల నుంచి విదేశీ గమ్యస్థానాలకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఎల్బర్స్‌ తెలిపారు.

ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సరీ్వసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్‌లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచి్చంది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్‌ తీసుకుంది.   

టికెట్‌ ధరలు కీలకం.. 
విమానాల నిర్వహణ వ్యయాలు, టికెట్‌ ధరల మధ్య సహ సంబంధం ఉండాలని, లేకపోతే విమానయాన సంస్థలు మనుగడ సాగించలేవని ఎల్బర్స్‌ అభిప్రాయపడ్డారు. ఇండిగో అందుబాటు ధరలపైనే దృష్టి సారించినట్టు చెబుతూ, సీజన్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఇవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయని వెల్లడించారు. ఇండిగో వృద్ధి దశలో ఉందన్నారు. అదే సమయంలో దేశంలో ఏవియేషన్‌ హబ్‌ల అవసరాన్ని ప్రస్తావించారు.

సొంతంగా నెట్‌వర్క్‌ నిర్మించుకోవడంతోపాటు, ప్రస్తుత పట్టణాలను నూతన మార్గాలతో (భువనేశ్వర్‌–సింగపూర్‌ తరహా) అనుసంధానిస్తున్నట్టు పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. అలాగే, ఇతర ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలను కూడా పెంచుకుంటున్నట్టు వివరించారు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌తో కోడ్‌õÙర్‌ భాగస్వామ్యాన్ని ఈ నెలలోనే ఇండిగో కుదుర్చుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు