లైఫ్‌స్టైల్‌ రిటైలింగ్‌కు ఐటీసీ టాటా

4 Aug, 2022 06:26 IST|Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌స్టైల్‌ రిటైలింగ్‌ బిజినెస్‌ నుంచి వైదొలగినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. బిజినెస్‌ పోర్ట్‌ఫోలియోపై వ్యూహాత్మక సమీక్ష తదుపరి ఇందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం విల్స్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండుతో ఐటీసీ ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఫార్మల్, క్యాజువల్, డిజైనర్‌ వేర్‌సహా పలు దుస్తులను విక్రయించడంతోపాటు.. జాన్‌ ప్లేయర్స్‌ బ్రాండుతో పురుషుల క్యాజువల్స్, డెనిమ్స్, ఫార్మల్స్‌ తదితరాలను సైతం మార్కెటింగ్‌ చేసింది. అయితే 2019లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా లైఫ్‌స్టైల్‌ రిటైలింగ్‌ బిజినెస్‌ను తగ్గించుకుంది. జాన్‌ ప్లేయర్స్‌ బ్రాండును రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించింది. కొన్ని పాత స్టోర్స్‌లోగల విల్స్‌ బ్రాండు నిల్వలను విక్రయిస్తున్నట్లు గత నెలలో కంపెనీ చైర్మన్‌ సంజీవ్‌ పురి వెల్లడించిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు