జైపూర్‌లో నోట్ల వర్షం హల్‌చల్‌: వీడియో వైరల్‌

3 Oct, 2023 18:28 IST|Sakshi

Money Heist' Attire రాజస్థాన్‌లోని జైపూర్‌లో  నోట్ల వర్షం కురిసిన ఘటన  గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఫలితంగా  ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించిన  వీడియో  సోషల్ మీడియాలో  వైరలవుతోంది. ఈ ఘటన జైపూర్‌లోనిమాల్వియా  నగర్‌లోని గౌరవ్ టవర్ సమీపంలో చోటు చేసుకుంది.

'మనీ హీస్ట్'  సిరీస్‌ స్ఫూర్తితో మనిషి నోట్ల వర్షం కురిపించాడు. తన ముఖంపై సాల్వడార్ డాలీ మాస్క్‌తో ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఉన్నట్టుండి  బిజీగా ఉన్న మార్కెట్‌లో గాలిలో డబ్బుల వర్షం కురిపించాడు. దీనితో  భారీ సంఖ్యలో గుమిగూడిన  ప్రజలు వీలైనన్ని ఎక్కువ నోట్లను అందిపుచ్చుకోవడానికి  పరుగులు తీశారు. ఇందులో దాదాపు అన్నీ 20, 10 రూపాయల నోట్లు ఉన్నట్టు సమాచారం.

ఈ సంఘటనతో  ఆ ప్రాంతంలో ఎక్కడి వాహనాలు అక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్ కావడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ చర్యకు కారణమైన వ్యక్తిని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసి, విచారణ కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు జ్ఞానచంద్ యాదవ్ వెల్లడించారు. 

'మనీ హీస్ట్': అలెక్స్ పినా రూపొందించిన స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్

మరిన్ని వార్తలు