టెక్‌ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్‌!

28 Dec, 2022 17:02 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు జపాన్‌ ప్రభుత్వం భారీ ఎత్తున ఫైన్‌ విధించింది. జపాన్‌ రాజధాని టోక్యో నుంచి యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ అమ్మకాల్ని నిర్వహిస్తుంది. అయితే టోక్యోకి వచ్చే విదేశీయులకు యాపిల్‌ కంపెనీ భారీ ఎత్తున ఐఫోన్‌లతో పాటు ఇతర డివైజ్‌లపై ఎలాంటి దిగుమతి సుంకం చెల్లించకుండా బల్క్‌లో ఫ్రీగా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహించిన యాపిల్‌ 105 మిలియన్లు (రూ. 870 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు క్యోడో మీడియా పలు కథనాల్ని ప్రచురించింది.

క్యోడో నివేదిక ప్రకారం..జపాన్‌లో యాపిల్‌ సంస్థ $1,04,16,84,000 (రూ. 8,634 కోట్లు) పన్ను మినహాయింపు పొందింది. ఇంపోర్ట్‌ డ్యూటీ చెల్లించకుండా సెప్టెంబర్ 2021 నుండి రెండు సంవత్సరాల పాటు విక్రయాలు సాగించినట్లు  ట్యోక్యో రీజనల్‌ ట్యాక్సేషన్‌ బ్యూరో అధికారులు గుర్తించారు. యాపిల్‌ తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రొడక్ట్‌లపై రీసేల్‌ నిర్వహించినట్లు పేర్కొంది. 

అనైతికంగా వ్యాపారం
యాపిల్‌ అనైతికంగా నిర్వహిస్తున్న బిజినెస్‌పై దృష్టిసారించిన ట్యాక్సేషన్‌ బ్యూరో గతేడాది నుంచి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసాదారణ లావేదేవీలు, యాపిల్‌ స్టోర్‌ నుంచి వందల సంఖ్యలోని యాపిల్‌ డివైజ్‌లను టూరిస్ట్‌లకు అమ్మినట్లు గుర్తించిందని జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అందుకే తక్కువ సేల్స్‌ (underreported) నిర్వహించిన ప్రొడక్ట్‌లపై 105 మిలియన్ల అదనపు పన్ను, ట్యాక్స్‌ చెల్లించాల్సిన ఉత్పత్తులపై అదనపు వినియోగపు పన్నును భారీగా విధించనుంది. 

టూరిస్ట్‌ల ముసుగులో
జపాన్‌కు వచ్చిన విదేశీయులు ఆరు నెలలలోపు కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదే వస్తువుల్ని రీసేల్‌ చేస్తే.. జరిపిన విక్రయాలను బట్టి పన్ను కట్టాలి. కాబట్టే యాపిల్‌..ఐఫోన్‌లు, ఇతర ప్రొడక్ట్‌లను జపాన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు విక్రయించి.. ఆపై వాటిని విదేశాలకు భారీ ఎత్తున తరలించి పన్ను మినహాయింపు పొందేలా బిజినెస్‌ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు ట్యాక్స్‌ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు.   

చైనా పౌరులపై కేసులు
2020లో జపాన్‌ను సందర్శించేందుకు టూరిస్ట్‌, ఇతర వీసాలను ఉపయోగించిన ఏడుగురు చైనీయులపై కేసులు నమోదయ్యాయి. ఒసాకా ప్రాంతీయ ట్యాక్స్‌ బ్యూరో అధికారులు వారి కొనుగోళ్లపై సుమారు $56,58,162 (దాదాపు రూ. 46 కోట్లు)ను వసూలు చేసింది. క్యోడో నివేదించిన ప్రకారం రూ. 475 కోట్ల విలువైన లగ్జరీ బ్రాండ్ వస్తువులు. వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో కూడిన ఉత్పత్తులను రీసేల్ కోసం కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

కాగా, ఈ ఏడాది జూన్‌లో రీసేల్‌ నిర్వహించేందుకు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో కాస్మోటిక్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన సందర్భాలు వెలుగులోకి రావడంతో ట్యాక్స్‌ బ్యూరో అడ్మినిస్ట్రేటీవ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్ట్‌మెంట్ స్టోర్‌ల యజమానులు అనైతికంగా విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు.  

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్‌ కుక్‌ ఇక్కడ ఏం జరుగుతోంది’?

మరిన్ని వార్తలు