వాహనాలకు పండుగ జోష్‌

14 Nov, 2023 08:02 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్‌ వాహనాల టోకు విక్రయాలు అక్టోబరులో రికార్డు స్థాయిలో పెరిగాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) శుక్రవారం తెలిపింది. పటిష్ట పండుగ సీజన్‌ డిమాండ్‌ ఇందుకు దోహదం చేసిందని వెల్లడించింది.

‘గత నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వెహికిల్స్‌ సంఖ్య 3,89,714 యూనిట్లు. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 16 శాతం అధికం. త్రిచక్ర వాహనాలు 42 శాతం ఎగసి 76,940 యూనిట్లను తాకాయి. ఒక నెలలో ఈ స్థాయి యూనిట్లు హోల్‌సేల్‌లో విక్రయం కావడం ఇదే తొలిసారి.

ద్విచక్ర వాహనాలు 20 శాతం అధికమై 18,95,799 యూనిట్లుగా ఉంది. ఈ మూడు విభాగాలు అక్టోబర్‌ నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి ఊపందుకోవడం పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వ స్థిర అనుకూల విధానాలు, కొనసాగుతున్న పండుగల సీజన్‌తో ఇది సాధ్యమైంది’ అని సియామ్‌ తెలిపింది.   

మరిన్ని వార్తలు