జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్‌ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్‌స్క్రైబర్లు

12 May, 2023 20:05 IST|Sakshi

కొత్తగా వచ్చిన స్ట్రీమింగ్ యాప్‌ జియోసినిమా (JioCinema) దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) విలవిలాడుతోంది. మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. జియోసినిమా మార్కెట్‌లో ప్రజాదరణ పెరుగుతున్న స్ట్రీమింగ్ యాప్‌గా మారింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల 

వీక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించడం.  ఇదే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆసియాలో దాని సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి  ఏకంగా 8.4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు హాట్‌స్టార్‌కు బై బై చెప్పేశారు.

సబ్‌స్క్రైబర్‌లు బై..బై
కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో డిస్నీ ప్లస్ పెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 4 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. 2023 ఏప్రిల్ 1  నాటికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ 52.9 మిలియన్ల పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. క్యూ2లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఒక్కో పెయిడ్ సబ్‌స్క్రైబర్‌ నుంచి సగటు నెలవారీ ఆదాయం 0.74 నుంచి 0.59 డాలర్లు తగ్గింది.

జియోసినిమాకు కలిసొచ్చిన ఐపీఎల్ 
జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జియో సినిమా ప్రతిఒక్కరికీ ఉచితం. ఎటువంటి  సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ లేదు. అదే డిస్నీ హాట్‌స్టార్‌ ను వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించాలి. జియో సినిమా విజయానికి అసలు కారణం ఐపీఎల్ ను ఉచితంగా చూసే అవకాశం. ఏదైనా ఉచితంగా వస్తున్నప్పుడు ఎవరైనా దాని కోసం ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు?

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!

మరిన్ని వార్తలు