మహీంద్రా లాజిస్టిక్స్‌ చేతికి రివిగో ‘బీ2బీ’ వ్యాపారం

27 Sep, 2022 06:31 IST|Sakshi

ముంబై: లాజిస్టిక్స్‌ సంస్థ రివిగో సర్వీసెస్‌కు చెందిన బీ2బీ ఎక్స్‌ప్రెస్‌ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్‌ (ఎంఎల్‌ఎల్‌) వెల్లడించింది. వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ) రూపంలో ఈ డీల్‌ ఉంటుందని పేర్కొంది.

దీని ప్రకారం రివిగోలోని బీ2బీ ఎక్స్‌ప్రెస్‌ వ్యాపారం అసెట్స్, కస్టమర్లు, టీమ్, టెక్నాలజీ ఫ్లాట్‌ఫాం మొదలైనవి ఎంఎల్‌ఎల్‌కు దక్కుతాయి. ఎక్స్‌ప్రెస్‌ నెట్‌వర్క్‌ ప్రస్తుతం 250 ప్రాసెసింగ్‌ కేంద్రాలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా 19,000 పిన్‌ కోడ్‌లకు సర్వీసులు అందిస్తోంది. తమ వ్యాపారా సామర్థ్యాలను మరింత పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్‌ ఉపయోగపడగలదని ఎంఎల్‌ఎల్‌ ఎండీ రామ్‌ప్రవీణ్‌ స్వామినాథన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు