సరికొత్త మార్పులతో మారుతి సుజకీ వ్యాగన్‌ఆర్‌...!

3 Aug, 2021 15:55 IST|Sakshi

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్తగా వ్యాగన్‌ఆర్‌ ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను మార్కెట్లలోకి లాంచ్‌ చేసింది. ఈ కారు 1L లేదా 1.2L ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో లభ్యమవుతుందని తెలుస్తోంది. వ్యాగన్‌ఆర్‌ ఎక్స్‌ట్రా కారు లిమిటిడెట్‌ ఎడిషన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్‌ వ్యాగన్‌ఆర్‌ వేరియంట్‌కు 13 కొత్త అప్‌గ్రేడ్‌లతో రానుంది. కారు ఇంటీరియర్స్‌, ఎక్స్‌టిరియర్స్‌ గణనీయంగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యాగన్‌ఆర్‌ కారును సుమారు రూ. 22,990 అదనంగా చెల్లించడంతో అప్‌గ్రేడ్‌ అవుతుంది. కారులో స్టైలింగ్‌లో భాగంగా కారు వెనుక బంపర్‌ ప్రొటెక్టర్‌, సైడ్‌ స్కర్ట్‌, వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌, బాడీసైడ్‌ మౌల్డింగ్‌, ఫాగ్‌ ల్యాంప్‌ గార్నిష్‌, అప్పర్‌ గ్రిల్‌ క్రోమ్‌ గార్నిష్‌, వెనుక డోర్‌కు క్రోమ్‌ గార్నిష్‌, నంబర్‌ ప్లేట్‌ సరికొత్తగా అమర్చారు. అంతేకాకుండా డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్,  కార్ ఛార్జర్ ఎక్స్‌టెండర్ సౌకర్యాలను కలిగి ఉంది. 

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. 1.0 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ 67 బిహెచ్‌పి సామర్థ్యంతో 90 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ 1.2 లీటర్‌ ఇంజన్‌ 82 బీహెచ్‌పీ సామర్థ్యంతో 113 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. భద్రత పరంగా కారులో ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్‌ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లను అమర్చారు. 

మరిన్ని వార్తలు