కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్‌ కనెక్టివిటీలో కొత్త శకం

3 Aug, 2021 14:35 IST|Sakshi

ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎంజీ మోటార్స్‌ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్‌ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్‌ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. 

ఎంజీ ప్లస్‌ జియో
మోరిసన్‌ గ్యారెజేస్‌ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్‌, గ్లూస్టర్‌ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్‌ రేంజ్‌ ఎస్‌యూవీని లాంఛ్‌ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్‌ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్‌ ఛేంజర్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. 

నెట్‌ కనెక్టివిటీ
త్వరలో రిలీజ్‌ చేయబోతున్న మిడ్‌ రేంజ్‌ ఎస్‌యూవీలో నిరంతం నెట్‌ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్‌ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్‌వర్క్‌ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్‌ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లను జియో అందివ్వనుంది.  దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్‌నెట్‌ను పొందవచ్చు.

ఏమూలనైనా
కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్‌మెంట్‌ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్‌ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్‌ ఫీచర్లు యాడ్‌ చేస్తున్నారు. అయితే ఇంటర్‌నెట్‌ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్‌ కనెక్టివిటీ లభిస్తుంది.

టెక్నాలజీలో నంబర్‌ 1
జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్‌ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్‌ ప్రెసిడెంట్స్‌, ఎండీ రాజీవ్‌ చాబా అన్నారు.  కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్‌మెంట్‌, స్ట్రీమింగ్‌, టెలిమాటిక్స్‌ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు