రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? 

6 Jun, 2023 18:44 IST|Sakshi

కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్  నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్‌ పేరుతో  బ్రాండెడ్‌ జ్యువెలరీ బిజినెస్‌లోకి  ఎంట్రీ ఇస్తోంది.  బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ  జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్‌, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్‌టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో  దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో  పెయింట్స్,  B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు  మూడు పెద్ద  వ్యాపారాల్లోకి  ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్‌ తనిష్క్‌, ఇటు రిలయన్స్‌కు  ప్రధాన ప్రత్యర్థిగా  పోటీ పడనుంది.  (తనిష్క్‌, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ)

గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్.  25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా  గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్  ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్‌ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం)


ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడి,  ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు.  లిస్ట్ A క్రికెట్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో,  ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు.

అత్యంత సంపన్న క్రికెటర్‌, కానీ 
భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్య‌మన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్‌ కావాలనేది అతని డ్రీమ్‌. ఆల్‌ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఈ ఏడాది  ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్‌ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ హెడ్‌ కూడా. అలాగే  D2C ప్లాట్‌ఫారమ్ TMRW  బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది.

ఇలాంటి మరిన్ని సక్సెస్‌ స్టోరీలు,ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షిబిజినెస్‌
 

మరిన్ని వార్తలు