Ramkripa Ananthan గ్లాస్‌ సీలింగ్‌ బ్రేక్స్‌: ఈ మెకానికల్‌ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా

6 Oct, 2023 14:20 IST|Sakshi

దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్‌ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్‌ ఇంజనీరింగ్‌, డిజైనింగ్‌ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్  పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్‌ స్టూడియోను కూడా  నిర్వహిస్తున్న  రామ్ కృపా అనంతన్‌ గురించి,  ఆమె సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం.

మహీంద్రా అండ్‌ మహీంద్ర అండ్‌ లేటెస్ట్‌ వాహనాల్లో థార్‌ SUVకున్న క్రేజ్‌గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్‌ 2వ తరం థార్‌ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్‌ కృపా. పాపులర్‌ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు  చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు.

ఎవరీ రామ్‌ కృపా అనంతన్‌
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా   కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్‌ చేసిన క్రెడిట్‌ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్‌లను రూపకల్పన చేశారు.  దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు.

క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్‌
రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2  అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది.

'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ 
దేశీయ ఈవీ మేకర్‌ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో  ఉంటుందని అంచనా. గత ఏడాది  ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు