ఏరోస్పేస్‌, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్

4 Nov, 2023 10:25 IST|Sakshi

మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్‌, విద్యుత్‌ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్‌ ప్రోడక్ట్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్

జేకే ఫైల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ అనుబంధ సంస్థ రింగ్‌ ప్లస్‌ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్‌, రింగ్‌ ప్లస్‌ అక్వా, మైనీ ప్రెసిషన్‌లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్‌కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్‌ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. 

మరిన్ని వార్తలు