iPhone 12: యాపిల్‌ యూజర్లకు బంపరాఫర్‌!

5 Jun, 2022 12:29 IST|Sakshi

టెక్‌ దిగ్గజం యాపిల్‌ యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. క్రోమా యాపిల్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2022 సందర్భంగా ఐఫోన్‌ 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇతర ప్రొడక్ట్‌లను సైతం తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది.                                        

యాపిల్‌ సంస్థ క్రోమా యాపిల్‌ ఫెస్టివల్‌ 2022 సేల్‌ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్‌లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తుంది. ఈ సేల్‌ సందర‍్భంగా ఐఫోన్‌, మాక్‌ బుక్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచెస్‌, ఎయిర్‌ పాడ్స్‌ల ధరల్ని భారీగా తగ్గించేసింది. పలు బ్యాంకుల ద్వారా జరిపే చెల్లింపులపై ఆఫర్లు, ఎక్ఛేంజ్‌ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం క్రోమాలో యాపిల్‌ ఐఫోన్‌12ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 64జీబీ స్టోరేజ్‌ 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో ఉన్న ఫోన్‌ను పై 14శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.65,900 ఉండగా రూ.53,900కే కొనుగోలు చేయోచ్చు.ఒకవేళ​ మీ వద్ద పాత ఫోన్‌ ఉంటే ఎక్ఛేంజ్‌ కింద రూ.15,610 వరకు తగ్గింపు పొందవచ్చు.  దీంతో పాటు నెలకు రూ.2,683 ఈఎంఐ చెల్లించుకోవచ్చు. 
 

మరిన్ని వార్తలు