మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్‌

30 Sep, 2023 04:54 IST|Sakshi

క్రూడ్‌ అయిల్‌ రిఫైనరీ నిర్మాణం

డీల్‌ విలువ రూ.5,400 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్‌ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది.

మేఘా ఇంజనీరింగ్‌ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్‌బటోర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్‌ రిఫైనరీ స్టేట్‌ ఓన్డ్‌ ఎల్‌ఎల్‌సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌  రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్‌ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు