సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

9 Nov, 2023 08:43 IST|Sakshi

Stock Market Updates: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ సూచీలు నేడు నష్టాల బాట పట్టాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ 85.33 పాయింట్ల నష్టంతో 64890.28 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్ల నష్టంతో 19416.30 వద్ద కొనసాగుతున్నాయి.

ఐరోపా మార్కెట్లు బుధవారం లాభాల్లో స్థిరపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం మూడు నెలల కనిష్ఠానికి చేరిన చమురు ధరలు ఈరోజు మరింత కిందకు వెళ్లాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 79.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) బుధవారం రూ.84.55 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.524.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

గాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మహింద్ర అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, లార్సెన్ అండ్ టబ్రో (Larsen & Toubro) కంపెనీలు ఉన్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు