మైక్రోసాఫ్ట్‌ ఆదాయం 13శాతం వృద్ధి

26 Oct, 2023 11:49 IST|Sakshi

సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. 

గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి  రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. 

సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్‌ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్‌ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు