MG Comet EV: ఎంజీ కామెట్‌ కాంపాక్ట్‌ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!

26 Apr, 2023 12:59 IST|Sakshi

చీపెస్ట్‌ ఎలక్ట్రిక్ కార్‌: ఎంజీ కామెట్‌ ఈవీ

ప్రారంభ ధర  రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్)

సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చేస్తున్న ఎంజీ బుజ్జి ఈవీ కామెట్‌ లాంచ్‌ అయింది.  అందరూ ఊహించినట్టుగానే రూ. 10లక్షల లోపు ధరతోనే తీసుకొచ్చింది. పరిచయ ఆఫర్‌గా దీని ప్రారంభ ధరను  రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిటీ రన్‌అబౌట్ కోసం చూస్తున్న కొనుగోలుదారులే లక్ష్యంగా స్పోర్టీ లుక్‌,  యూనిక్‌ కలర్స్‌లో  కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్  ను లాంచ్‌ చేసింది.  అందుబాటులో లభ్యం  కానున్న ఈ కారు  ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువేనని సగటున నెలకు ధర రూ. 519 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. 

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ధర, లభ్యత 
కామెట్ ఈవీ ప్రారంభ ధర  రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏప్రిల్ 27 నుండి టెస్ట్ డ్రైవ్‌కి అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు నెల తర్వాత మొదలవుతాయి. వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్‍లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్‍ రూఫ్‍తో గ్రీన్, బ్లాక్ రూఫ్‍తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. (ఏఐపై ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో )

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్  ఫీచర్లు 
ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఇది  41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఇక  దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని  ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‍లతో  కామెట్‌ ఈవీని తీసుకొచ్చింది. 2,974mm పొడవు, 1,505mm వెడల్పు ,1,640mm ఎత్తును 2,010mm వీల్‌బేస్‌తో వచ్చింది.  ఇక పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశంలో లభించే ఇతర చిన్న కారు ఆల్టో K10  కంటే , కామెట్ ఈవీ కంటే 556 మిమీ పొడవు తక్కువ.

10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లలో ఒకటి ఇన్ఫోటైన్‍మెంట్ డిస్‍ప్లేగా, రెండోది ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‍ప్లేగా ఉంటుంది.  యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్‍లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా 12 ఇంచుల వీల్స్‌ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి  ప్రధాన ఫీచర్లున్నాయి.  టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుంది.  టాటా టియాగోతో పోలిస్తే   ధర కూడా తక్కువే కావడం గమనార్హం. (ముంబై ఇండియన్స్‌ బాస్‌ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)

మరిన్ని వార్తలు