ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..

26 Oct, 2023 20:05 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్‌హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది.

19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్‌లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్‌రూమ్‌లు, సిబ్బందికి 188 బెడ్‌రూమ్‌లు, 92 ఆఫీసులు, 78 బాత్‌రూమ్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్‌.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్‌మెంట్‌ కొనేసింది!

ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది.

ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు