ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్‌అంబానీ కూతురు మాత్రం కాదు!

29 Sep, 2023 17:22 IST|Sakshi

భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తన కూతురు ఇషా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా చేశారు. ఇది అత్యంత ఖరీదైన వివాహంలో ఒకటిగా నిలిచింది కూడా. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహల్లో నెంబర్‌వన్‌ మాత్రం కాదట. ఆ స్థానం ప్రిన్స్‌ చార్లెస్‌, ప్రిన్స్‌ డయాన వివాహమే ఉంది. వారి వివాహమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఔను! ఇది నిజం. ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్‌ చేయలేదట.

ముఖేష్‌ అంబానీ తన కూతురు ఇషా అంబానీని పిరమల్‌ గ్రూప్‌ అధినేత ఆనంద్‌ పిరమల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. దానికి అయ్యిన ఖర్చు ఏకంగా రూ. 400 కోట్లు. దీన్ని చూసి మనం నోరెళ్లబెటం కానీ ప్రిన్స్‌ చార్లెస్‌, ప్రిన్సెస్‌ డయానా వివాహ ఖర్చు దాదాపు రూ. 914 కోట్లు పైనే అయ్యిందట. అత్యధిక మంది వీక్షించిన వివాహ ఈవెంట్లలో ఇది ఒకటిగా నిలిచింది కూడా. అంతేగాదు ప్రిన్సెస్‌ డయానా ధరించి దుస్తులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

డయనా డ్రస్‌ను ప్రముఖ డిజైనర్లు మాజీ భార్యభర్తలు డేవిడ్‌, ఎలిజబెత్‌ ఇమాన్యుయెల్‌ రూపొందించారు. ఈ డ్రస్‌ ఖరీదు దాదాపు రూ. 4.1 కోట్లు. ఈ జంట పెళ్లి రోజున ఏకంగా మూడు వేల ఖరీదైన బహుమతులు అందుకున్నారు కూడా. వాటిలో ఎక్కువగా ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, పాత్రలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రిన్సెస్‌ డయానా వివాహమే రికార్డులు నెలకొల్పగా, అత్యంత ఖరీదైన వివాహ డ్రస్‌ ధరించని వధువుగా రికార్డు ఇషా అంబానీకే దక్కుతుంది. ఎందుకంటే ఇషా అంబానీ ఏకంగా ఏకంగా రూ. 90 కోట్ల విలువైన గోల్డెన్ అండ్ రెడ్ లెహెంగా ధరించారు.

 కాగా, ప్రిన్స్‌ చార్లెస్‌, డయానాల వివాహానికి దాదాపు 250 మంది సంగీతకారుల లైవ్‌ మ్యూజిక్‌ అందించగా, ఈ వేడుకకు దాదాపు 1400 మంది అతిరథులు హాజరయ్యారు. విషాదం ఏంటంటే ఈ జంట చివరికి విడాకులు తీసుకున్నారు. పైగా కొద్ది సంవత్సరాల్లోనే యువరాణి డయనా ఒక విషాద కారు ప్రమాదంలో మరణించారు. ఏదీ ఏమైనా ఇంప్పటికీ ఆ జంట పేరు మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు ఉండటం విశేషం. 

(చదవండి: అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్‌గా 'మమ్మీలా'...)

మరిన్ని వార్తలు