నా క్రెడిట్‌ స్కోర్‌ ఎంత? 

11 Jun, 2021 00:00 IST|Sakshi

రుణ అర్హతను తెలుసుకునేందుకు ఆసక్తి 

గత కొన్నేళ్లలో పెరిగిన ధోరణి 

ముంబై: తమ క్రెడిట్‌ స్కోర్‌ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఎక్కవ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు సంబంధించి క్రెడిట్‌ స్కోర్‌ తెలుసుకోవడం గత కొన్నేళ్లలో భారీగా పెరిగినట్టు క్రెడిట్‌ సమాచార కంపెనీ ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ తెలిపింది. 2017తో పోలిస్తే 2020లో రూ.25,000 దిగువన వ్యక్తిగత రుణాల్లో 23 రెట్ల వృద్ధి నమోదు కాగా.. 2020లో క్రెడిట్‌ స్కోర్‌ తెలుసుకోవడం అన్నది మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.

అన్ని క్రెడిట్‌ సమాచార సంస్థలు (క్రెడిట్‌ బ్యూరోలు) ఏడాదికి ఒక్కసారి ఉచితంగా ప్రతీ వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌/రిపోర్ట్‌ తెలుసుకునే అవకాశం కల్పించాలంటూ ఆర్‌బీఐ 2016 సెపె్టంబర్‌లో ఆదేశాలు తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత నుంచి వ్యక్తులు ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ను తెలుసుకోవడం పెరిగినట్టు గమనించొచ్చు. పరపతికి సంబంధించి వ్యక్తుల్లో అవగాహన పెరిగిందని.. క్రెడిట్‌స్కోర్‌ను ఎక్కువ పర్యాయాలు తెలుసుకునే వారి సంఖ్య రెట్టింపైనట్టు సిబిల్‌ నివేదిక తెలియజేసింది. 

మరిన్ని వార్తలు