మోటోరోలా బడ్జెట్ మొబైల్ వచ్చేసింది

8 Dec, 2020 14:57 IST|Sakshi

మోటోరోలా మొబైల్ వినియోగదారుల కోసం మరో బడ్జెట్ మొబైల్ ని తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మోటో జీ9కి తదుపరి మోడల్ గా మోటో జీ9 పవర్ తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ మొబైల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపి ట్రిపుల్ కెమెరాలు మరియు స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ తో 6.8-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను తీసుకొచ్చారు. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ లో మొబైల్స్ పై భారీ తగ్గింపు)

మోటో జీ9 పవర్ ఫీచర్స్ & ధర:
మోటో జీ9 పవర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. మోటో జీ9 పవర్ 6.8-అంగుళాల హెచ్ డీ ప్లస్ (720 x 1,640 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఆన్‌బోర్డ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించడం ద్వారా 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ 9 పవర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ కెమెరా ఎఫ్/1.79 లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్ వెనుక-ఫింగర్ ప్రింట్ మౌంటెడ్ స్కానర్ మరియు 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తుంది. కనెక్టివిటీ కోసం మోటో జీ 9 పవర్ 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంది. భారతదేశంలో మోటో జీ9 పవర్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .11,999. ఎలక్ట్రిక్ వయొలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 15వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు