Reliance JioMotive: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే!

6 Nov, 2023 08:56 IST|Sakshi

రిలయన్స్ జియో 'జియోమోటివ్' (JioMotive) పేరుతో భారతీయ మార్కెట్లో ఓ సరికొత్త డివైజ్ లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 వద్ద లభించే ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ కారులోని సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుంది. ఈ కొత్త జియోమోటివ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

జియోమోటివ్ అనేది ప్లగ్​ అండ్​ ప్లే 'ఓబీడీ' (On-Board Diagnostics) గ్యాడ్జెట్. ఏ కారునైనా స్మార్ట్‌గా మార్చే ఈ డివైజ్.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్‌తో పాటు కారులోని సమస్యలను కూడా ముందుగానే తెలియజేస్తుంది. దీంతో వినియోగదారుడు వాటిని పరిష్కరించుకోవచ్చు, తద్వారా మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ రిలయన్స్ డిజిటల్, జియో.కామ్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.

జియోమోటివ్ ఫీచర్స్

  • రియల్ టైమ్ ట్రాకింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ కారులో ఫిక్స్ చేస్తే.. వాహనాన్ని 24 గంటలు పర్యవేక్షించవచ్చు. ఇది దొంగతనాలకు ఖచ్చితంగా చెక్ పెడుతుంది.
  • జియో-ఫెన్సింగ్: ఈ ఫీచర్ ద్వారా మ్యాప్‌లో వర్చువల్ సరిహద్దులను(బౌండరీస్) సెట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
  • వెహికల్ హెల్త్ మానిటరింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ ద్వారా 100 కంటే ఎక్కువ డీటీసీ అలర్ట్ పొందవచ్చు. తద్వారా సమస్య పెద్దదికాకముందే పసిగట్టి పరిష్కరించుకోవచ్చు.
  • డ్రైవింగ్ అనలిటిక్స్: డ్రైవర్​ డ్రైవింగ్​ బిహేవియర్​ని కూడా ఈ గ్యాడ్జెట్ ఎనలైజ్​ క్సహిస్తుంది. ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ, హార్ష్​ డ్రైవింగ్​- బ్రేకింగ్​, హార్ష్​ యాక్సలరేషన్​ వంటి అంశాలపై అలర్ట్​ పొందొచ్చు.

ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్‌.. విర‌క్తితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఇప్పుడు ల‌క్ష‌ కోట్ల కంపెనీకి బాస్

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి

  • గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి జియోథింగ్స్ (JioThings) యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 
  • జియో నెంబర్ ద్వారా లాగిన అయిన తరువాత '+' మీద క్లిక్ చేసి జియోమోటివ్ ఎంచుకుని, ఐఎమ్ఈఐ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
  • కారు రిజిస్ట్రేషన్ నెంబర్, కారు పేరు (బ్రాండ్ నేమ్), మోడల్, ఫ్యూయెల్ టైప్ వంటి మీ కారు వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓబీడీ పోర్ట్‌కి జియోమోటివ్ గ్యాడ్జెట్ ప్లగ్ చేసి.. తరువాత దశలను కంప్లీట్ చేయాలి.
  • JioEverywhereConnect నెంబర్ షేరింగ్ ప్లాన్ రూల్స్ అంగీకరిస్తున్నట్లు టిక్ చేసి, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత JioJCR1440 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వగానే మీకు జియో నుంచి యాక్టివేట్ అభ్యర్థనకు ఓకే మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేట్ కావడానికి 10 నిముషాలు కారును ఆన్‌లోనే ఉంచాలి.

రిజిస్ట్రేషన్, యాక్టివేట్ వంటి వివరాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నట్లతే.. పరిష్కారం కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు.

మరిన్ని వార్తలు