యూపీఐ ద్వారా బీఎన్‌పీఎల్‌

22 Sep, 2022 06:29 IST|Sakshi

నందన్‌ నిలేకని అభిప్రాయాలు

ముంబై: ఇప్పుడు కొనుక్కో– తరువాత చెల్లించు(బయ్‌ నౌ పే లేటర్‌–బీఎన్‌పీఎల్‌) వంటి మరిన్ని ప్రొడక్టులను యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలంటూ టెక్నాలజీ రంగ వెటరన్‌ నందన్‌ నిలేకని పేర్కొన్నారు. యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిలేకని రుపే క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐ అధికారికంగా అనుమతించడంతో యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రుపే కార్డును నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో రుపే కార్డ్‌ విడుదల క్రెడిట్‌ సేవలకు సంబంధించి ఉపయుక్తమైన తొలి అడుగు అంటూ నిలేకని వ్యాఖ్యానించారు. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ప్లాట్‌ఫామ్‌ ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన నిలేకని ఆర్‌బీఐ అనుమతితో భవిష్యత్‌లో విభిన్న రుణ సౌకర్యాలకు తెరలేచే వీలున్నట్లు అంచనా వేశారు. 40.5 కోట్లమంది ప్రజలు యూపీఐను వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోట్లమందికి బీఎన్‌పీఎల్‌ తదితర మార్గాలలో డిజిటల్‌ లావాదేవీలకు వీలు ఏర్పడితే వినియోగదారు రుణాలు బహుముఖాలుగా విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు