ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! బ్యాంక్‌ అత్యవసర ప్రకటన!

16 Oct, 2023 16:48 IST|Sakshi

SBI customers alert: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)  సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది.

కారణం ఇదే..
ఎస్‌బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ చేపట్టింది. దీని కారణంగా ఎస్‌బీఐ కస్టమర్‌లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్‌బీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) పోస్ట్ ద్వారా తెలియజేసింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎస్‌బీఐ త్వరలోనే సమస్యను పరిష్కరిస్కామని వివరించింది.

దేశంలో యూపీఐ చెల్లింపులు 2016లో ప్రారంభమయ్యాయి.  డిజిటల్‌ పేమెంట్లు విస్తృతం కావడంతో నాటి నుంచి నేటి వరకూ యూపీఐ లావాదేవీలు అనేక రెట్లు పెరిగాయి. 2018 జనవరిలో 151 మిలియన్లు ఉన్న యూపీఐ లావాదేవీల సంఖ్య 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరింది.

మరిన్ని వార్తలు