-

బతికే ఉన్నా మహా ప్రబో...దీనానాథ్ దీన గాథ!

26 Nov, 2023 18:12 IST|Sakshi

బతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించిన, ఫించను ఆపివేసిన ఘటన వార్తల్లోనిలిచింది. దీంతో నేను బతికే ఉన్నాను( మై జిందా హూం) అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని నిరసనకు  దిగారు.  ఆగ్రాలో 70 ఏళ్ల వృద్ధుడు దీనానాథ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. 

ఇండియా టుడే కథనం ప్రకారం ఆగ్రా చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (CDO) కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వ రికార్డుల్లో దీనానాథ్ యాదవ్ చనిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో పెన్షన్ఆగిపోయింది. విషయం తెలుసుకున్న దీనానాథ్‌ సంబంధిత అధికారులను కలిసాడు. గత ఎనిమిది నెలలుగా జిల్ల మెజిస్ట్రేట్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. అయినా ఫలితం లేదు. దీంతో నేను  బతికే  ఉన్నాను అనిరాసి వున్న ప్లకార్డు   మెడలో వేలాడదీసుకుని నిరసనకు దిగాడు .దీంతో  స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ యాదవ్ అందించిన పత్రాలను పరిశీలించి షాక్‌ అయ్యారు.  విచారణ జరపాల్సింగా  సంబంధిత అధికారులకు ఆదేశించారు.  

అటు తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన దీనానాథ్‌ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రతిరోజూ పొలానికి వెళ్తానని, గత రెండేళ్లుగా వృద్ధాప్య పింఛను  కూడా తీసుకుంటున్నానని వాపోయాడు. అయితే ఈ ఏడాది మార్చిలో పింఛను ఆగిపోయిందని, తొలుత గ్రామ కార్యదర్శిని, ఆ తరువాత సీడీవో కార్యాలయాన్ని సంప్రదించగా సంతృప్తికర సమాధానం రాలేదని తెలిపారు. నెలల తరబడి పెన్షన్‌ నిలిచిపోవడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోఈ నిరసనకు దిగినట్టు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ రికార్డులలో బతికి ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడంలాంటి ఘటనలు చాలానే ఉన్నాయనీ, ఇలాంటి బాధితులు వందలాది  మంది  ఉన్నారనే విమర్శలు  వినిపిస్తున్నాయి. 
 

 

మరిన్ని వార్తలు