బిల్డర్‌లకు రేటింగ్‌! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి

30 May, 2023 08:00 IST|Sakshi

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్‌ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు.

సీఐఐ నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్‌ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్‌ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు.

చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది.

ఇదీ చదవండి: పార్లమెంట్‌ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..

మరిన్ని వార్తలు