భారత్ మార్కెట్‌లోకి ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. విడుదల ఎప్పుడంటే

22 Dec, 2023 22:03 IST|Sakshi

ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా 660’ స్పోర్ట్ టూరర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. యమహా ఆర్7, కవాసాకి నింజా 650, హోండా సీబీఆర్ 650ఆర్ మోటారు సైకిళ్లతో ట్రయంఫ్ డేటోనా 660 బైక్ పోటీ పడనున్న ఈ బైక్‌ భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లో వచ్చేనెల 9న ఆవిష్కరించేందుకు ట్రయంఫ్‌ యాజమాన్యం సిద్ధమైంది. భారత్ మార్కెట్‌లో డేటోనా ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.9.50 లక్షలుగా నిర్ణయించారు. 

టైగర్ స్పోర్ట్ 660, ట్రైడెంట్ 660 మోటారు సైకిళ్లలో వాడిన ఇంజిన్, 660సీసీ ట్రయంఫ్ ఇంజిన్ త్రీ-సిలిండర్, లిక్విడ్  కూల్డ్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81 హెచ్పీ విద్యుత్, 64 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్, 2-వే క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 2-రైడింగ్ మోడ్స్- రెయిన్, రోడ్ మోడ్స్‌లో లభిస్తుంది.

డ్యుయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్ హ్యాండిల్ బార్, ట్రైడెంట్, టైగర్ స్పోర్ట్ మోటారు సైకిళ్లలో మాదిరిగా స్విచ్ గేర్స్, లీవర్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్‌లో నాన్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ యూఎస్డీ డౌన్‌ఫోర్క్, రేర్‌లో మోనో షాక్ యూనిట్, రెండు వీల్స్‌పై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

>
మరిన్ని వార్తలు