‘శాడిస్ట్‌ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’

20 Dec, 2023 21:19 IST|Sakshi

ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్‌లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్‌ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్‌ కొలీగ్స్‌, శాడిస్ట్‌ బాస్‌, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్‌ ప్లేస్‌ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. 

ఇదిగో ఈ తరహా వర్క్‌ కల‍్చర్‌ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్‌ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు  సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్‌ మీద రివెంజ్‌ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది.  

సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్‌ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. 

జాబ్‌ రిజైన్‌ చేశా. రిజైన్‌ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్‌ పాస్‌వర్డ్‌లు మార్చాను. దీంతో రెస్టారెంట్‌ యాజమాన్యం, బాస్‌, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్‌ కూడా చేశారు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశా. పాస్‌ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్‌ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా ప‌ని ప్ర‌దేశంలో స‌రైన వాతావ‌ర‌ణం కొర‌వ‌డితే ఎలాంటి ప‌రిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్‌ చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు