మార్కెట్‌లో ‘ఆర్‌బీఐ’ హుషారు

7 Oct, 2023 07:33 IST|Sakshi

ముంబై: అంచనాలకు తగ్గట్లే ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారీ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ చేసింది. రేట్ల సంబంధిత ఫైనాన్స్, రియల్టీ, ఆటో షేర్లు రాణిండంతో సెన్సెక్స్‌ 364 పాయింట్లు పెరిగి 65,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,654 వద్ద నిలిచింది.

ఆసియా, యూరప్‌ మార్కెట్ల రికవరీ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. క్రూడాయిల్‌ ధరలు మరింత దిగిరావచ్చనే అశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.

ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ ప్రకటన వెల్లడి తర్వాత మరింత దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 464 పాయింట్లు బలపడి 66,096 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 19,676 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. 

మరిన్ని వార్తలు