ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్‌..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!

21 Oct, 2022 16:57 IST|Sakshi

ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్‌ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్‌ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్‌ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్‌ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే? 

ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్‌ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్‌ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి. 

చదవండి👉 ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్‌ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా డెలాయిట్‌.. గతేడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన ఫ్రెషర్లకు ఇవ్వాల్సిన ఆఫర్‌ లెటర్లను ఇచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డెలాయిట్‌ నిర్ణయంపై ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

‘క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డెలాయిట్‌కు సెలక్ట్‌ అయ్యాయి. నేను సెలక్ట్‌ అయ్యానంటూ 2021అక్టోబర్‌లో డెలాయిట్ కన్ఫామ్‌ చేసింది. అప్పటి నుంచి ఆఫర్ లెటర్ కోసం, జాయిన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాన్నా’ ఓ ఫ్రెషర్‌ ఆవేదన 
 
‘క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో డెలాయిట్‌ అసోసియేట్ ఎనలిస్ట్, కన్సల్టింగ్ డిపార్ట్ మెంట్ పొజిషన్‌లో జాబ్‌ వచ్చింది. ఇప్పటి వరకు ఆఫల్‌ లెటర్‌ రాలేదు. సంస్థ ఈ ప్రక్రియను ఎందుకు అంత ఆలస్యం చేస్తోంది?’ - ప్రశ్నిస్తున్న ఓ అభ్యర్ధి


 
‘డెలాయిట్ ఆఫ్‌లెటర్‌లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఫ్రెషర్‌లు అవమానంగా ఫీలవుతున్నారు. ఆన్‌బోర్డింగ్‌ ప్రాసెస్‌ ఆలస్యం చేసిన తరువాత, నా కుటుంబ సభ్యులు,బంధువులు ఉద్యోగం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నేను వారిని మోసం చేశానని అందరూ అనుకుంటున్నారు’ - ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓ అభ్యర్ధి 

ఆఫర్‌ లెటర్‌ల ఆలస్యం సుమారు 500మందిపై ప్రభావం చూపింది. మాకు టెలిగ్రామ్ గ్రూపు ఉంది. సుమారు 500 మంది ఇందులో భాగం. ఈ ఆలస్యంపై డెలాయిట్ నుండి రిప్లయి కోసం ఎదురు చూస్తున్నాను. -  టెలిగ్రామ్ గ్రూప్‌ సభ్యుడు, డెలాయిట్‌ ఇచ్చే ఆఫర్‌ లెటర్‌ కోసం ఎదురు చూస్తున్న ఓ అభ్యర్ధి

ఆఫర్‌ లెటర్లు ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు డెలాయిట్‌ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఆఫర్‌లెటర్ల గురించి అడగ్గా..‘మేం నియామకాలు,కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆఫర్‌లెటర్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకు కొంత సమయం పడుతుంది’ అని రిప్లయి ఇచ్చారు. 

కాగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, మైండ్ ట్రీతోఎ పాటు అనేక ఐటీ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇవ్వకపోవడం, వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.

చదవండి👉 దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్‌ అదిరిపోయే ఆఫర్‌!

మరిన్ని వార్తలు