మళ్లీ ఎన్‌ఎస్‌ఈ టాప్‌, వరుసగా నాలుగో ఏడాది రికార్డ్‌

30 Jan, 2023 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సే్ఛంజీగా వరుసగా నాలుగో ఏడాది నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) నిలిచింది. ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యరీత్యా 2022లోనూ రికార్డ్‌ నెలకొలి్పంది. ఫ్యూచర్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌(ఎఫ్‌ఐఏ) వెల్లడించిన వివరాలివి. మరోవైపు నాలుగో ఏడాదిలోనూ టాప్‌ ర్యాంకులో నిలిచినట్లు ఎన్‌ఎస్‌ఈ సైతం ఒక ప్రకటనలో తెలియజేసింది.

అంతేకాకుండా లావాదేవీల సంఖ్య(ఎల్రక్టానిక్‌ ఆర్డర్‌ బుక్‌) రీత్యా 2022లో ఈక్విటీ విభాగంలో ఎన్‌ఎస్‌ఈ మూడో స్థానానికి మెరుగుపడినట్లు ఎక్సే్ఛంజీల వరల్డ్‌ ఫెడరేషన్‌(డబ్ల్యూఎఫ్‌ఈ) వెల్లడించింది. 2021లో ఎన్‌ఎస్‌ఈ నాలుగో ర్యాంకులో నిలిచింది. గత క్యాలండర్‌ ఏడాది(2022)లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ–50 18,887ను అధిగమించడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్‌లో లిక్విడిటీ భారీగా పెరిగింది. ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్‌ల రోజువారీ సగటు టర్నోవర్‌ 2022లో 51 శాతం జంప్‌చేసి రూ. 470 కోట్లను తాకింది. ఇక సెకండరీ మార్కెట్లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల రోజువారీ సగటు టర్నోవర్‌ 59% ఎగసి రూ. 7 కోట్లకు చేరింది. ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ గత నెలలో సగటు టర్నోవర్‌ రూ. 3 కోట్లకు చేరడం గమనార్హం!

చదవండి: గత ఎన్నికల ముందు బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి?

మరిన్ని వార్తలు