కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!!

14 Nov, 2023 20:57 IST|Sakshi

టెస్లా తన మొదటి సైబర్‌ట్రక్‌ను ఈ నెలలో విడుదల చేయడానికి సర్వత్రా సిద్ధమైపోయింది. ఎలాన్ మస్క్ ఈ కొత్త కారుని విడుదల చేయడానికి ముందే కొనుగోలుదారులకు కొన్ని షరతులు పెట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా సైబర్‌ట్రక్‌ (Tesla Cybertrack) త్వరలో విడుదలకానుంది. కంపెనీ నియమాల ప్రకారం ఈ కారు కొన్ని కస్టమర్ కొన్న మొదటి సంవత్సరం లోపల విక్రయించినట్లతే.. 50000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలి ఉంటుందని వెల్లడించారు. ఈ రూల్ కేవలం సైబర్‌ట్రక్ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది.

కంపెనీ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే.. భవిష్యత్తులో వారికి టెస్లా కంపెనీ తమ వాహనాలను విక్రయించాడని కూడా స్పష్టం చేసింది. కాబట్టి సైబర్‌ట్రక్ కొనుగోలు చేసిన కస్టమర్ ఒక సంవత్సరం వరకు విక్రయించడానికి అవకాశం లేదని స్పష్టమైంది.

ఇదీ చదవండి: టీసీఎస్‌‌ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు!

2019లో మొదటి సారి కనిపించిన సైబర్‌ట్రక్ దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. నాలుగు సంవత్సరంలో కంపెనీ విడుదల చేసిన మొదటి వాహనం కూడా ఇదే అని పలువురు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర 39900 డాలర్లు ఉండవచ్చు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు