హైదరాబాద్‌లో ఎక్స్‌ఫెనో రిక్రూట్‌మెంట్ డెలివరీ కేంద్రం ప్రారంభం

11 Oct, 2023 16:17 IST|Sakshi

ఇండియన్ స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీల్లో ఒకటైన ఎక్స్‌ఫెనో హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా  హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో సేవలు అందించనున్నారు.

తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా పాల్గొని ఆర్‌డీసీని ప్రారంభించారు. అలాగే టీపాజిటివ్‌ (బిల్డింగ్‌ అండ్‌ సస్టేనింగ్‌ ఏ టాలెంట్‌ పాజిటివ్‌ తెలంగాణ) పేరుతో వివిధ కంపెనీల్లోని సీఎక్స్‌ఓ, హెచ్‌ఆర్‌ పరిశోధన నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సంస్థలతో పాటు, యునికార్న్‌లు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక​్‌ ఉద్యోగుల ఉన్న హైదరాబాద్‌కు ఈ నివేదిక ఎంతో ఉపయోగమని అన్నారు.

ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. దేశంలో తమ టెక్ సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని అన్నారు. తెలంగాణలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్‌ఫెనో హైదరాబాద్‌ ఆపరేషన్స్ విభాగాధిపతి సతీష్ మన్నె అన్నారు.  ‘ఉమెన్ ఇన్ ది వర్క్‌ఫోర్స్’ అనే అంశంపై ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిల్ ఏతానూర్, పెగా సిస్టమ్స్ హెచ్‌ఆర్‌ స్మృతి మాథుర్, ది స్టార్ ఇన్ మీ  సహ వ్యవస్థాపకుడు ఉమా కాసోజీ, హెచ్‌ఆర్‌ఎస్‌ఎస్‌ డీఎస్‌ఎం గ్లోబల్‌ డైరెక్టర్‌ డా.దినేష్ మురుగేశన్ పాల్గొన్నారు. 


ఎక్స్‌ఫెనో ఇప్పటి వరకు 12,000 మంది ఇంజినీర్లను నియమించింది. ఆర్‌డీసీ ద్వారా స్పెషలిస్ట్ టాలెంట్ సోర్సింగ్, లీడర్‌షిప్ హైరింగ్, టాలెంట్ డిప్లాయ్‌మెంట్, మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తుంది. టాలెంట్ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన అనేక ఆన్ డిమాండ్ ఆఫర్‌లను కూడా కల్పిస్తుంది. 

మరిన్ని వార్తలు