జనవరి 18న లాంచ్ కానున్న ఒప్పో రెనో 5 ప్రో

6 Jan, 2021 15:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో 5జీ మొబైల్ ను ఇండియాలో జనవరి 18న మధ్యాహ్నం 12:30గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పో రెనో 5 5జీ సిరీస్ గత నెలలో చైనాలో లాంచ్ అయింది. ఒప్పో రెనో 5 4జీ వేరియంట్‌ను కొన్ని రోజుల క్రితం వియత్నాంలో విడుదల చేశారు. ప్రస్తుతానికి ఒప్పో రెనో 5 ప్రో 5జీ మాత్రమే భారతదేశంలో లాంచ్ ప్రకటించింది. అయితే సమీప భవిష్యత్తులో కంపెనీ ఇతర మోడళ్లను దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్

ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్:
ఒప్పో రెనో 5ప్రో 5జీ యొక్క ఇండియన్ వేరియంట్ లక్షణాలు చైనీస్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ ఆండ్రాయిడ్ 11లో కలర్‌ఓఎస్ 11.1 డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో నడుస్తుంది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. రెనో 5ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ చేత పనిచేయనుంది. ఏఆర్ఎం జీ77 జీపీయూతో పాటు 12జీబీ ర్యామ్ ఉంటుంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ మాక్రో షూటర్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ పోర్ట్రెయిట్ షూటర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 32 ఎంపీ కెమెరా ఉంది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 లాంచ్ ఎప్పుడంటే!)

దింట్లో 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో 4,350ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ల విషయానికి వస్తే జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటి సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా(సుమారు రూ.38,200) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,799 యువాన్లుగా(సుమారు రూ.42,700) నిర్ణయించారు.

మరిన్ని వార్తలు