Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!

18 Nov, 2021 17:57 IST|Sakshi

ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్‌ సందర్భంగా ఢమాల్‌ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్‌లోకి ఎంటరైంది. లిస్టింగ్‌ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్‌ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

బీఎస్ఈలో ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే పేటీఎం షేరు విలువ 27.25% లేదా రూ.585.85 నుంచి రూ.1,564కు పడిపోయింది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 19.99% తక్కువగా ముగిసింది. నేటి సెషన్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ సమయంలో పేటిఎమ్ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,955తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు 27.44% తక్కువగా రూ.1,560 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. 

(చదవండి: యాపిల్‌ బంపర్‌ ఆఫర్‌..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!)

పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్‌ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్స్‌(క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్‌ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూనే ఉంది. కోల్‌ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080-2,150గా కంపెనీ నిర్ణయించింది.

(చదవండి: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు)

మరిన్ని వార్తలు