Phonepe: ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్‌.. దేశంలోనే తొలిసారిగా..

27 May, 2023 15:38 IST|Sakshi

Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్‌ఎస్‌ నివేదిక పేర్కొంది.

ఇప్పటికే రూపే క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ టోటల్‌ పేమెంట్‌ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. 

చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్‌సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్‌ అవుట్‌ లెట్‌లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్‌ చేస‍్తున్నాయి. 

ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్‌ కార్డ్‌ ఈకో సిస‍్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్‌పే కన్జ్యూమర్‌ ప్లాట్‌ఫామ్‌ అండ్‌ పేమెంట్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సోనికా చంద్రా తెలిపారు.

చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

మరిన్ని వార్తలు