పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. ఎన్‌పీఏల భారం!

2 Nov, 2022 10:52 IST|Sakshi

63 శాతం తగ్గిపోయిన లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్టాండలోన్‌ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో 63% తగ్గిరూ.411 కోట్లకు చేరింది. ఆదాయం రూ.23,001 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,105 కోట్లు, ఆదాయం రూ.21,262 కోట్ల చొప్పున ఉన్నాయి. మొండి బకాయిల భారం కొంత తగ్గినప్పటికీ.. వీటి కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలను ప్రభావితం చేసింది.

వడ్డీ ఆదాయం రూ.17,980 కోట్ల నుంచి రూ.20,154 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.8,271 కోట్లుగా ఉంది. రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 13.36 శాతం నుంచి 10.48 శాతానికి (రూ.87,034 కోట్లు) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 5.49 శాతం నుంచి 3.80 శాతానికి పరిమితమయ్యాయి.

చదవండి: ఎయిర్‌టెల్‌ బంపరాఫర్‌: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్‌, తెలిస్తే వావ్‌ అనాల్సిందే!

మరిన్ని వార్తలు