గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు!

4 Oct, 2023 15:48 IST|Sakshi

గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన లబ్ధి దారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది.

 ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేలా కేబినెట్‌ నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌  మీడియా సమావేశంలో వెల్లడించారు. 

గతంలో రూ.200 ఇప్పుడు..
గతంలో కేంద్రం పీఎంయూవై పథంలోని లబ్ధి దారులు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 రాయితీ అందించేది. ఇప్పుడు మరో రూ.100 పెంచింది. దీంతో ఇంతకు ముందు ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర​ రూ.703 ఉండగా, తాజాగా, కేంద్రం నిర్ణయంతో పీఎంయూవై పథకం కింద సిలిండర్‌ ధర రూ.603కే లభ్యమవుతుంది. 

రూ.1650 కోట్లు విడుదల
గత నెలలో కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1,650 కోట్లను విడుదల చేసింది. ఉజ్వల కనెక్షన్‌ పెంపుతో పీఎంయూవై పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.35 కోట్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు