రాపిపే నుంచి మైక్రో ఏటీఎం

9 Sep, 2020 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్  : క్యాపిటల్‌ ఇండియా ఫైనాన్స్‌కు చెందిన అనుబంధ కంపెనీ రాపిపే మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టింది. కస్టమర్లు రాపిపే సాథి కేంద్రాలకు వెళ్లి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకింగ్‌ సేవలూ పొందవచ్చు. చిన్న వర్తక కేంద్రాలను సాథి స్టోర్లుగా కంపెనీ మలుస్తోంది. దేశవ్యాప్తంగా 11 వేలపైచిలుకు ప్రాంతాల్లో  50,000లకుపైగా సాథి కేంద్రాలను రాపిపే నిర్వహిస్తోంది. సాథి కేంద్రాల నిర్వాహకులు బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి 19 శాతమే. ఈ నేపథ్యంలో గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు చేరేందుకు మైక్రో ఏటీఎంలు చక్కని పరిష్కారమని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు