గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!

17 Nov, 2023 17:30 IST|Sakshi

టెక్నాలజీలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటోంది. భారతీయులు కూడా జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు.

2015లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎంపిక కావడంతో దాదాపు 25 పెద్ద సంస్థలు భారతీయ సంతతికి చెందిన వారి నేతృత్వంలోకి చేరాయి. ఇది గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు చాలా కంపెనీలు భారతీయ సీఈఓల నిర్వహణలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?

మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా వసంత్ నరసింహన్, మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓగా గణేష్ మూర్తి, ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణన్, నెట్ యాప్ సీఈఓగా జార్జ్ కురియన్, మార్నింగ్ స్టార్ సీఈఓగా కునాల్ కపూర్, మైక్రా టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వహిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు