Raymond Group Chairman Divorce: విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్‌ షాకింగ్‌ ప్రకటన

13 Nov, 2023 14:44 IST|Sakshi

Gautam Singhania ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ సింఘానియా సోమవారం భార్య నవాజ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. పండగవేళ తన జీవితంలో ఒక ముఖ్యమైన వార్తను సోషల్‌ మీడియాద్వారాపంచుకున్నారు. ఈ దీపావళి గతంలో లాగా ఉండబోదు అని రేమండ్ లిమిటెడ్ సీఎండీ సింఘానియా ట్విటర్‌లో  పోస్ట్‌లో తెలిపారు. ముంబైలో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను అలా ప్రకటించారో లేదో ఇలా విడాకుల విషయాన్ని ప్రకటించడం బిజినెస్‌ వర్గాలను విస్మయ పర్చింది. 

దంపతులుగా ముప్పయి రెండేళ్లు ఎంతో నిబద్ధతగా పరస్పరం  విశ్వాసంగా జీవించాం.  తల్లిదండ్రులుగా మారాం. ఒకరికొకరు తోడూ నీడగా ఒక బలమైన అండగా నిలబడ్డాం. ఫలితంగా మరో రెండు అందమైన జీవితాలు  జతకలిశాయి  ఇపుడిక వేరు వేరు మార్గాల్లో జీవించాలని  నిర్ణయించుకున్నాం అంటూ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఇటీవలి కొన్ని దురదృష్టకర సంఘటలు, కొంతమంది వ్యక్తుల వల్ల  చాలా నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి.

ఈ క్రమంలో వజ్రాల్లాంటి  పిల్లలు నిహారిక, నిసా కోసం ఏం చేయాలో అది చేస్తామని కూడా  సింఘానియా వెల్లడించారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి, తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా  కోరారు. టెక్స్‌టైల్స్-టు-రియల్ ఎస్టేట్  దిగ్గజం సింఘానియా ఎనిమిదేళ్ల పరిచయం తర్వాత  న్యాయవాది నాడార్‌ మోడీ కుమార్తె నవాజ్‌ మోడీని 1999లో  వివాహం చేసుకున్నారు. 

కాగా రేమండ్‌ గ్రూపు బలమైన వృద్ధిని సాధించిందనీ, 5 వేల కోట్ల రూపాయలతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సింఘానియా  సోమవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దుస్తుల బ్రాండ్‌ రేమండ్ గ్రూప్‌ను జయపత్ సింఘానియా నెలకొల్పగా, అతని కుమారుడు, గౌతమ్ సింఘానియా ఈ  గ్రూపును మరిన్ని రంగాలకు  విస్తరించారు.

మరిన్ని వార్తలు