108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్‌, ఫస్ట్‌ సేల్‌ ఆఫర్‌ కూడా!

9 Dec, 2022 17:03 IST|Sakshi
ఫోటో క్రెడిట్‌: రియల్‌మీ

సాక్షి,ముంబై:  రియల్‌మీ 10 ప్రో 5జీ సిరీస్‍లో  కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రియల్‍మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్, నెబ్యూలా బ్లూ కలర్ ఆప్షన్‍లలో  అందుబాటులోకి వస్తోంది. రియల్‍మీ 10 ప్రోప్లస్‌ 5జీ కూడా మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 

రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ 5జీ స్పెసిఫికేషన్లు
6.72   ఫుల్‌హెచ్‍డీ ఎల్‍సీడీ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 680నిట్స్ పీక్
స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 13
108+2 ఎంపీ  రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్

ధరలు, ఆఫర్‌
రియల్‍మీ 10 ప్రోప్లస్‌ 5జీ 14 నుంచి డిసెంబరు నుంచి ఫస్ట్‌ సేల్‌ షురూ  అవుతుంది. కాగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా  కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.


రియల్‍మీ 10 ప్రో 5జీ
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.19,999 ధరతో వచ్చింది. డిసెంబరు  16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌ ద్వారా లభ్యంకానుంది.  లభిస్తుంది. రియల్‍మీ అధికారిక వెబ్‍సైట్‍లోనూ ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు