రిలయన్స్‌ మరో రికార్డు

23 Jul, 2020 15:48 IST|Sakshi

13 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్‌ మార్కెట్‌క్యాప్‌

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్‌ 

సాక్షి, ముంబై: ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంతింటై..వటుడింతై అన్నట్టు రోజు రోజుకీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఇప్పటికే రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానానికి చేరుకోగా తాజాగా రిలయన్స్‌ షేరు ఆల్‌టైం గరిష్టాన్ని తాకడంతో సంస్థ మార్కెట్‌ క్యాప్‌ 13 లక్షల రూపాయలను దాటేసింది. దీంతో భారీ మార్కెట్ క్యాప్ ఉన్నతొలి భారతీయ కంపెనీగా  రిలయన్స్ నిలిచింది. (టాప్‌ 5 లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ)

ఆర్‌ఐఎల్ షేర్లు 2.30 శాతం లాభంతో గురువారం ఇంట్రాడేలో 2050 రూపాయల గరిష్టాన్ని తాకింది. గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్ల లాభాలతో మార్కెట్‌ క్యాప్‌ 12 లక్షల నుంచి 13 లక్షల నుంచి చేరుకోవడం విశేషం. డాలర్ పరంగా ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 173 బిలియన్‌ డాలర్లకు చేరింది. 171.9 బిలియన్ డాలర్ల ఒరాకిల్ కార్పొరేషన్ ఎంక్యాప్‌ కంటే ఇది ఎక్కువ. దీంతో  మార్కెట్‌ క్యాప్‌ పరంగా ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 50 వ స్థానాన్ని ఆక్రమించింది.

కాగా రిలయన్స్‌ జియో ఆవిష్కారంతో  పలు సంచలనాలనున మోదు చేసిన రిలయన్స్‌  మూడు నెలల్లోనే 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించింది. తాజాగా 33,737 కోట్లు రూపాయలను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పెట్టుబడిగా పెట్టనుంది. దీంతో అనుకున్న సమాయానికంటే ముందుగానే రిలయన్స్‌ రుణరహిత సంస్థగా అవతరించింది. దీనికితోడు దేశంలో5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. అలాగే 4 జీ/ 5 జీ నెట్‌వర్క్‌కుమారాలనుకునే 2జీ  కస్టమర్ల కోసం గూగుల్ సహకారంతో తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అభివృద్ధి చేయాలని ఆర్‌ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. జియో త్వరలో తన మొబైల్ నెట్‌వర్క్‌లో 400 కోట్ల మంది చందాదారులను చేర్చుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు