మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్‌..?

2 Jan, 2024 12:37 IST|Sakshi

సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్‌ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్‌, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్‌ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. 

ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్‌‌‌‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్‌‌‌‌ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల ​కోసం ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్‌ ధర.. ఎంతంటే..

కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌ (కోల్‌‌‌‌ను ఫ్యూయల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌‌‌‌ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌‌‌‌ను  హైడ్రోజన్‌‌‌‌, మీథేన్‌‌‌‌, మిథనాల్‌‌‌‌, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల  వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌‌‌‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌  ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌‌‌‌ను గ్యాస్‌‌‌‌గా మార్చాలని  ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.

>
మరిన్ని వార్తలు