వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!

14 Mar, 2022 16:42 IST|Sakshi

మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన ఏదైనా ఒక పాత వాహనం ఉందా?.. అయితే, మీకో షాకింగ్ న్యూస్​. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్​సీ రెన్యువల్​, ఫిట్​నెస్​ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్​సీ రెన్యువల్​కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

అంతేగాక, ఆర్​సీ రెన్యువల్​ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్​లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికేట్ రెన్యువల్​ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్​​ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దిగుమతి చేసుకున్న కార్ల ఆర్​సీ రెన్యువల్​ ఫీజు రూ.15,000 నుంచి రూ.40,000కి పెరిగింది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.

కొత్త ఫీజులు ఇలా..

వ్యక్తిగత వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజు

వెహికల్​ టైప్​     రిజిస్ట్రేషన్​ ఫీజు    రెన్యువల్​ ఫీజు

మోటార్​ సైకిల్:​     300                       1,000

థ్రీవీలర్          :     600                       2,500

కారు/జీపు         :    600                       5,000

ఇంపోర్టెడ్​ వెహికల్:​   5,000              40,000

కమర్షియల్​ వాహనాల ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ ఫీజు

వెహికల్ టైప్      ఫిట్​నెస్​ ఫీజు   రెన్యువల్ ఫీజు

మోటార్ సైకిల్:     500              1,000

థ్రీవీలర్          :   1,000             3,500

ట్యాక్సీ/క్యాబ్​   :    1,000             7,000

మీడియం గూడ్స్​ /ప్యాసింజర్​: 1,300       10,000

హెవీ గూడ్స్​/ప్యాసింజర్:​ 1,500         12,500

(చదవండి: రూ.322 కోట్లు డీల్‌, ‌టెక్‌ మహీంద్రా చేతికి మరో కంపెనీ!)

మరిన్ని వార్తలు